Tuesday, April 30, 2024
- Advertisement -

ములాయం సింగ్ కన్ను మూత.. ప్రముఖుల సంతాపం !

- Advertisement -

సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ( నేడు ) ఉదయం కన్నుమూశారు. 82 ఏళ్ల వయసున్న ములాయం గత కొన్నాళ్లుగా పలు ఆరోగ్యకరమైన సమస్యలతో భాద పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో పాటు, కిడ్నీసమస్యలతో చికిత్స పొందుతున్న ములాయం..నేడు ఉదయం గురుగ్రామ్ లోని వేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ములాయం మరణావార్తను ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇత్తర ప్రదేశ్ సి‌ఎం గా ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు పని చేశారు. అలాగే కేంద్రంలో కూడా రక్షణ శాఖ మంత్రిగా కొన్నాళ్లు పని చేశారు.

సమాజ్ వాది పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన ములాయం సింగ్ యాదవ్ ను ఉత్తర ప్రదేశ్ ప్రజలు ” యూపీ నేతాజీ ” గా పిలుస్తారు. ఇక ములాయం సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలుపుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి ములాయం సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ” దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ చెరిగిపోని ముద్రా వేశారని, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సేవలు అందించారని ఆయన మరణ వార్తతో దిగ్బ్రంతి కి గురైనట్లు ” మోడి చెప్పుకొచ్చారు. ములాయం సింగ్ మరణం దేశానికి తీరని లోటు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ములాయం సింగ్ సాధించిన విజయాలు అసాధారణమైనవని.. ” ధరణి పుత్రుడిగా ములాయం సింగ్ యాదవ్ ఎప్పటికీ నిలిచిపోతారని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -