Sunday, April 28, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. బీపీ తగ్గి అపస్మరక స్థితిలోకి వెళ్లిన రోశయ్య నోట్లో నుంచి రక్తం రావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రోశయ్య మార్గ మధ్యలోనే మృతి చెందారు.

1933లో గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. చిన్న తనంలోనే రాజకీయాలకు ఆకర్షితులైన ఆయన.. తొలిసారిగా 1965లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1968లో ఆయన నరసారావు పేట నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1979లో రోశయ్య తొలిసారి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. 1978వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో హొం శాఖ మంత్రిగా రోశయ్య పని చేశారు. 1989 నుంచి వరుసగా 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

1994-96 సంవత్సరాల్లో ఏపీ పీసీసీ చీఫ్‌గా రోశయ్య పని చేశారు. 2004లో వైఎస్‌ఆర్ హయాంలో ఖనిజ, భవనాల శాఖ మంత్రిగా రోశయ్య పనిచేశారు. 2009లో వైఎస్‌ఆర్‌ మరణం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆపధర్మ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2009-2011 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోశయ్య విధులు నిర్వర్తించారు. 2011 నుంచి 2016వరకు తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పని చేశారు. భారత మొదటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతో పాటు అనేక మంది ప్రధానులతో రోశయ్యకు సన్నిహత్యం ఉంది. 2008లో ఆంధ్రా యూనివర్సిటీ రోశయ్యకు డాక్టరేట్‌ ప్రధానం చేసింది.

రోశయ్య మరణ వార్త విన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రీగ్భాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. రాజకియయాల్లో రోశయ్య సుదీర్గ అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు.

రోశయ్య పార్థివ దేహాన్ని ఇంటికి తరలించనున్న కుటుంబ సభ్యులు.. పార్టీ కార్యక్తల చివరి చూపు కోసం రేపు గాంధీ భవన్‌కు తరలించనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -