జమ్మూకశ్మీర్ కే ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్ పై రగిలిపోతోంది. అంతర్జాతీయంగా మద్దతు రాకపోవడంతో మరింత అసహనానికి గురవుతోంది. ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. భారత్ పై దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. స్వదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వాల మీద సెటైర్లేసేలా పరిస్థితి తయారైంది. దీంతో ఏదోవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
తాజాగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద 100 మందికి పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలను పాక్ సైన్యం మోహరింపజేసిందనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ గుర్తించింది.పాక్ భూభాగం నుంచి పని చేసే ఉగ్ర సంస్థలతో కలసి ఈ కమెండోలు దాడులకు తెగబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తరచు తూట్లు పొడవడంలో పాక్ ఆర్మీ ఎస్ఎస్‌జీ కమెండోలదే ప్రధాన పాత్ర అని చెబుతున్నారు.