Sunday, April 28, 2024
- Advertisement -

వార్నింగ్ లు ఉండవు….సరిహద్దు దాటుడే.. పాక్ కు ఆర్మీ చీఫ్ హెచ్చరిక

- Advertisement -

ఆర్టికల్ 370 తర్వాత కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ కు భారత్ ఆర్మీ చీఫ్ రావత్ మరో సారి హెచ్చరించారు. పాక్ యుద్ధాన్ని కోరుకుంటోందని అదే జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ..కాశ్మీరీలు పవిత్ర యుద్ధం చేస్తున్నారని వారికి పాక్ మద్దతు ఇస్తే విజయం సాధిస్తారని చేసిన వ్యాఖ్యలపై బిపిన్ రావత్ మండి పడ్డారు.

పాకిస్థాన్ తీరు మార్చుకోనంతవరకూ తమ దాడులు కొనసాగుతాయన్నారు ఆయన… ఇకపై “హైడ్ అండ్ సీక్‌”లు కుదరవన్న ఆయన… ఇండియా గనక సరిహద్దు దాటాలని అనుకుంటే… గగనతలంలో, భూ మార్గంలో లేదా రెండు మార్గాల్లోనూ దాటతామని స్పష్టం చేశారు.అణ్వాయుద్ధాలతో యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని కూడా బిపిన్ రావత్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ సమాజం అలాంటి చర్యల్ని అనుమతించదని అన్నారు. అణ్వాయుధాలు రక్షణకు తప్ప యుద్ధానికి కాదన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ దాగుడుమూతలు ఆడుతోందన్నారు. ఇటువంటి చర్యలు ఎల్లకాలం సాగవని, మెరుపుదాడులతో భారత్‌ ఏంటో ఆ దేశానికి ఇప్పటికే తెలిసి వచ్చిందని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ హద్దు మీరి ప్రవర్తిస్తే భారత్‌ సరిహద్దు దాటడానికి వెనుకడుగు వేయదని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -