Monday, May 5, 2025
- Advertisement -

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గాలి తీసేసిన ప్రతిపక్ష పార్టీ పీపీపీ..

- Advertisement -

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంపై పాకిస్థాన్‌ ఇంటా, బయటా విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అంతర్జాతీయంగా మద్దతు లభించకపోవడంతో మరింత అసహనానికి లనయి భారత్ పై విషం క్కుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని రెచ్చగొట్టాలని చూసిన పాక్ కు భంగపాటే ఎదురైంది. ఇటు, స్వదేశంలో విపక్షం కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టింది.

ముఖ్యంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటిదాకా శ్రీనగర్ ను స్వాధీనం చేసుకోవడం అనేది పాక్ ప్రభుత్వ అజెండాగా ఉండేదని, ఇకపై పీవోకేను కాపాడుకుంటే అదే గొప్ప విషయం అని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వ్యంగ్యస్త్రాలు సంధించారు.

అలాగే ఇమ్రాన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న బలహీన విధానాలపైనా ఆయన మండిపడ్డారు. ముజఫరాబాద్ పాక్‌ ఆక్రమిత కశ్మీర్ రాజధాని. ఇమ్రాన్ స్వార్థపూరిత వైఖరితో పాక్ ప్రభుత్వ ప్రాధామ్యాలే మారిపోయాయని అన్నారు. సోమవారం జీ7 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశంపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా అది ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పారు ట్రంప్.ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని విపక్షాలు అక్కడి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -