Saturday, May 11, 2024
- Advertisement -

త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన జ్యోత‌ష్యునికి చుక్క‌లు చూపించిన మ‌హిళ‌

- Advertisement -

దేశంలో జ్యోతిష్యం పేరుతో మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న కామా బాబాలు పెరిగిపోతున్నారు. ఇప్ప‌టికే ఎన్నోమంది దొంగ స్వామ‌లు జైలు పాల‌య్యారు. అలాంటి సంఘ‌ట‌నే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. క‌ష్టాల‌తో స‌త‌మ‌వుతున్న ఓవివాహిత త‌న క‌ష్టాలు తీరుస్తార‌ని ఓ జ్యోతిష్యున్ని ఆశ్ర‌యించింది. ఇంకే ముంది స‌దురు జ్యోతిష్యునిలో కామ కోరిక‌లు చెల‌రేగాయి. దీంతో ఆమె ప‌ట్ల అభ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

తిష్యం పేరుతో ఆమెను వేధించిన అతడిప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకున్నాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వి.శంకర్‌రావు శాస్త్రి స్థానికంగా దివ్యసాయి జ్యోతిషాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న మన్నారుపోలూరుకు చెందిన ఓ వివాహిత అతడిని ఆశ్రయించింది. కష్టాలు తీరే మార్గం చెప్పాలని కోరింది.

ఆమెపై కన్నేసిన శంకర్‌రావు తొలుత పూజలు చేయాలంటూ కొంత డబ్బు తీసుకున్నాడు. అనంతరం తరచూ వివాహితకు ఫోన్ చేసి .. కష్టాలు తీరాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయాలని చెప్పాడు.. అయితే అందుకు కొన్ని నియమాలు పాటించాలని సూచించాడు కామ జ్యోతిష్యుడు.

ముందుగా నగ్నంగా వీడియో తీసి తనకు పంపాలని..లేదంటే తన పడక గదిలో నగ్నత్వాన్ని చూపించాల్సి ఉంటుందని.. పేర్కొన్నాడు. అక్కడితో ఆగకుండా ప్రతిరోజు ఫోన్ చేసి.. అసభ్యంగా మాట్లాడేవాడు. వాట‌న్నింటినీ తెలివిగా రాకార్డు చేసి పోలీసుల‌కు ఇచ్చింది. ఇంకే ముంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్‌రావును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -