వైఎస్ జగన్ దాడి ఘటనపై ముమ్మరంగా విచారణ సాగుతున్న సమయంలో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా శ్రీనివాస్‌ను సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హటాత్తుగా నిందితుడు శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత రావడంతో హుటా హుటిన కేజీహెచ్‌కు తరలించారు పోలీసులు. ఛాతీతో దడగా ఉందని, ఎడమ చేయి నొప్పిగా ఉందని శ్రీనివాస్ చెప్పారని డాక్టర్ దేవుడు బాబు తెలిపారు.
ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు చెప్పడంతో డాక్టర్ దేవుడుబాబు ఎయిర్ పోర్ట్ పోలీస్టేషణ్‌కు వచ్చి వైద్యపరీక్షలు చేశారు. డాక్టర్ సూచనల మేరకే శ్రీనివాస్‌ను కేజీహెఛ్‌కు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా వైద్యుడు దేవుడు బాబు మాట్లాడుతూ, శ్రీనివాసరావు తన చేతులు, ఛాతి నొప్పిగా ఉన్నాయని చెప్పాడని, దీంతో, క్షుణ్ణంగా పరీక్షించామని వైద్యులు చెప్పారు. శ్రీనివాసరావుకు బీపీ, షుగర్ సాధారణంగా ఉన్నాయని, తనకు వైద్య సహాయం వద్దని, తన అవయవాలు తీసుకుపోండంటూ అతను చెబుతున్నాడని అన్నారు. అయితే ఉదయం నుంచి శ్రీనివాస్ ఎటువంటి ఆహారం తీసుకోలేదని పోలీసులు తెలిపారు.