Saturday, May 18, 2024
- Advertisement -

ఎలుగు బంటి పిల్ల ప్ర‌య‌త్నానికి నెటిజ‌న్లు ఫిదా..

- Advertisement -

జీవితంలో ఒక్క ఎదురుదెబ్బ తగిలితేనే ఎంతో కుమిలిపోతాం.. కుంగిపోతాం. ఇక అలాంటి ఎదురుదెబ్బలు వరుసగా తగిలితే ఈ జీవితమే వద్దనుకుంటాం. కానీ ఈ పిల్ల ఎలుగు బంటిని చూస్తే.. మాత్రం జీవితమంటే పోరాటమని.. సమస్యలపై పోరాడితినే విజయం ఉంటుందని నిరూపించింది పిల్ల ఎలుగు బంటి. ఆ ఎలుగు పోరాటం చూస్తే.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. దాని ప్ర‌య‌త్నానికి నెటిజ‌న్లు ఫిదాఅయ్యారు.

కెనడియన్‌ టీవీకి చెందిన ఓ యువతి షేర్ చేసిన ఈ ఎలుగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. తల్లి ఎలుగు బంటి.. తన పిల్ల ఎలుగుతో ఎత్తైన మంచు కొండపైకి ఎక్కే ప్రయత్నం చేసింది. తల్లి ఎలుగుబంటి సాఫీగా కొండపైకి చేరుకుంది. కాని పిల్ల మాత్రం పైకి ఎక్కలేకపోయింది. పైకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. మంచుతో కిందకు పడిపోయింది.

మొత్తం మూడుసార్లు ప్రయత్నించినా.. కొండపైన ఉన్న తన తల్లిని మాత్రం చేరుకోలేకపోయింది. కాని చివరికి తన నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకుంది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం సొంతమవుతుందని నిరూపించింది.

ఈ వీడియోను గమనిస్తే మనకు జీవిత సత్యం బోధపడుతుంది. పిల్లల సమస్యలను వారినే పరిష్కరించుకునేలా సిద్ధం చేయాలని ఆ తల్లి ఎలుగుబంటి చెబితే.. అడ్డంకులెన్ని ఎదురైన నిరాశ పడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని పిల్ల ఎలగుబంటి చాటి చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -