Monday, May 6, 2024
- Advertisement -

పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన లేడీ డాక్ట‌ర్‌…ఆమె చేసిన ప‌ని ఏంటో తెలుసా..?

- Advertisement -

డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి ఓ లేడీ డాక్ట‌ర్ త‌ప్పుడు మార్గంలో వెళ్లింది. ఆమె చేసిన ప‌ని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. మూడేళ్ల వ్య‌వ‌ధిలో బెంగళూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్ 682 లింగ మార్పిడి సర్జరీలు చేసి..చివ‌ర‌కు పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఈ సెక్స్ మార్పిడి కుంభకోణం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది.

మాండ్యా పోలీసుల కథనం ప్రకారం…ఈ లింగ మార్పిడి కుంభ‌కోణం ఇటీవ‌లే వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు మహిళా డాక్టర్ ను విచారిస్తుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు సహకరించిన వారిని, ఆమె వద్దకు బాలురను తీసుకు వెళ్లే హిజ్రా కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో లేడీ డాక్టర్ 682 ఆపరేషన్లు చేసిందని, ఒక్కో ఆపరేషన్ కు ఆమె రూ. 1.25 లక్షలు తీసుకున్నట్టు తేలిందని మాండ్యా ఎస్పీ శివ ప్రకాశ్ దేవరాజు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్లు అతడి అమ్మమ్మ మాండ్యా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అదృశ్యమైన బాలుడు అక్టోబర్ నెలలో ట్రాన్స్ జెండర్ వేషధారణలో కేఆర్ పెట్ సర్కిల్ లో ఉండగా అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

కొందరు హిజ్రాలు తనకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి లింగమార్పిడి శస్త్రచికిత్సకు ఒప్పించారని పోలీసులకు తెలిపాడు. జూన్ నెలలో 19 ఏళ్లు ఉన్నట్లు ఓ బోగస్ సర్టిఫికెట్ తయారు చేసి బెంగళూరులోని ఓ మహిళా డాక్టర్ లింగ మార్పిడి చేసినట్లు పోలీసుల‌కు తెలిపారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -