Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రో యాత్ర‌కు సిద్ద‌మవుతున్న జ‌గ‌న్‌….

- Advertisement -

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడీ మొద‌ల‌య్యింది. అన్ని పార్టీల నాయ‌కులు ఎన్నిక‌ల‌కు అస్త్ర‌,శ‌స్త్రాలు సిద్దం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఎల‌క్స‌న్ మూడ్‌లోకి వెల్లారు. ఇప్ప‌టికే సంవ‌త్స‌రానికిపైగా పాద‌యాత్ర పేరుతో జ‌నంలో ఉన్న జ‌గ‌న్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ పై దృష్టిసారించేందుకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే మ‌రో యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు.

ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు వైఎస్ జగన్ రాష్ట్రంలో ఏడాది కాలంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. 2017 నవంబర్ 6న సొంత జిల్లా కడప నుంచి ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు జగన్ 326 రోజులు పాటు పాదయాత్ర చేసి దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు వైఎస్ జగన్.

ప్రజాసంకల్పయాత్ర ద్వారా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్యాష్ చేసుకునేందుకు జగన్ రెడీ అవుతున్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో సీట్ల సర్దుబాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట అయిన చంద్రబాబును ఢీకొట్టాలంటే సరైన వ్యూహంతో ముందుకు వెళ్లకపోతే కష్టం.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ..ఎన్నికల సమరానికి ఆయా పార్టీలు రెడీ అయిపోయాయి. ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా మ‌రింత దూకుడు పెంచాల్సిన స‌మ‌యం ఏర్ప‌డింది.

పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన జగన్ ఆ తర్వాత బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బస్సుయాత్ర కేంద్రంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. పార్టీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ వెంట‌నే ప‌రిస్క‌రించాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏఅభ్య‌ర్తికీ టికెట్ హామీ ఇవ్వ‌లేదు. స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను కూడా మారుస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడం వల్లే ప్రజాకూటమి బొక్క బోర్లా పడింది. ఇక్క‌డ కూడా అలాజ‌ర‌గ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చెయ్యాల్సిన అతిపెద్ద బాధ్యత జగన్ పై ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు వచ్చిన సర్వే రిపోర్ట్ లను జగన్ పరిశీలిస్తున్నారు. బ‌స్సుయాత్ర‌లోనే అభ్య‌ర్ధుల‌పై క‌స‌ర‌త్తు చ‌య‌నున్నారు జ‌గ‌న్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -