Saturday, May 18, 2024
- Advertisement -

వాళ్లు అమ్మాయిల‌ను న‌లిపేస్తున్నా.. అడిగే దిక్కులేదు

- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌లో కౌశ‌ల్ ఒక్క‌డే హుందాగా ఉంటున్నాడు. మిగ‌తా వారంతా ఆఖ‌రికి బాబూ గోగినేనితో స‌హా గోడ‌మీద పిల్లుల్లానే బ‌తుకుతున్నారు. కానీ.. ప్ర‌తిసారి కౌశ‌ల్‌ను తేజ‌స్వి, సామ్రాట్‌, త‌నిష్, దీప్తి సున‌య‌న బృందం టార్గెట్ చేస్తూనే ఉంది. ఇంచుమించు బిగ్‌బాస్ ప్రారంభం నుంచి కౌశ‌ల్‌ను వీళ్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే తాజాగా యాపిల్ పండ్ల టాస్క్‌లోనూ కౌశ‌ల్‌ను తేజ‌స్వి బృందం మ‌ళ్లీ టార్గెట్ చేసింది. యాపిల్ పండ్ల‌ను చెట్టుకు వేలాడ దీసేందుకు దానిని ప‌ట్టుకుని అక్క‌డే నిల‌బ‌డిపోయి క‌ద‌ల‌కుండా ఉన్న భానుశ్రీ, గీతామాధురిల‌ను ప‌క్క‌కు లాగేయాల‌ని కౌశ‌ల్‌, రోల్‌రైడా త‌దిత‌రులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చెట్టుకు ఉన్న యాపిల్‌ను తీసే క్ర‌మంలో దానిపై భానుశ్రీ ప‌డింది. అంతే.. అక్క‌డున్న‌ది కౌశ‌ల్ కావ‌డంతో తేజ‌స్వి జోక్యం చేసుకుని క్యారెక్ట‌ర్ లేనోడు, వాడితో ఏంటి, ప‌గ‌ల‌గొడ‌తా అంటూ.. ఏదేదో తిట్ట‌డం ప్రారంభించింది. భానుశ్రీ కూడా స‌పోర్ట్ దొరికింద‌న్న‌ట్టు కౌశ‌ల్‌కు అస‌లు క్యారెక్ట‌ర్ ఉంటే క‌దా.. అంటూ.. పెద్ద‌గా కేక‌లు వేస్తూ త‌న బుద్ధి ప్ర‌ద‌ర్శించింది. కానీ.. అదే స‌మ‌యంలో అక్క‌డున్న గీత‌.. మాత్రం వీరిద్ద‌రికి చెప్పుతెగేలా కొట్టిన‌ట్టు చేసింది.

త‌ప్పు.. అత‌ను అలా చేయ‌లేదు. నేను అక్క‌డే ఉన్నా.. వ‌ద్దు.. అంటూ తేజ‌స్వి, భానుశ్రీకి వార్నింగ్ ఇచ్చింది. అంతే వారి ముఖాల్లో నెత్తుటి చుక్క లేదు. వెంట‌నే భానుశ్రీ మాట మార్చేసింది. తాను చెయ్యి పెట్టాడ‌న‌లేదు. అక్క‌డ పెట్టినా తీసుకుంటావా అంటూ అన్నానంటూ ప్లేట్ పిరాయించింది. ఇంక తేజ‌స్విని అప్ప‌టికే కౌశ‌ల్‌ను అత్యంత నీచంగా.. ఓ ఆడ‌ది అన‌కూడ‌ని విధంగా అస‌హ్యం క‌లిగేలా తిట్టింది. కానీ.. గీతామాధురి నిల‌బ‌డ‌క‌పోయుంటే.. కౌశ‌ల్‌పై వీరిద్ద‌రూ ముద్ర వేసేసేవారే. ఎందుకంటే.. టాస్క్‌లో భాగంగా కౌశ‌ల్ టీంలో ఉన్న‌ది త‌నిష్‌, దీప్తిసున‌య‌న‌, బాబూగోగినేని, రోల్‌రైడా, నందిని, టీవీ9 దీప్తి.. వీళ్లలో కొంద‌రు తేజ‌స్వి టీంలో స‌భ్యులు, మిగ‌తావాళ్లు గోడ‌మీద పిల్లులు. అందుకే.. కౌశ‌ల్ తానొక్క‌డే ఒంటరిపోరాటం చేసి.. తాను ట‌చ్ చేయ‌లేద‌ని చెప్పుకోవ‌డంతో.. దానినీ తేజ‌స్వి, సామ్రాట్ లాంటి వాళ్లు చాలా దారుణంగా అవ‌మానించేలా ప్ర‌వ‌ర్తించారు. గీతామాధురి దేవుడిలా వ‌చ్చి ఎదుటి టీంలో ఉన్నా వాస్త‌వం చెప్పి.. కౌశ‌ల్ త‌ప్పులేద‌ని నిరూపించింది. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తో గీతామాధురి బిగ్‌బాస్ 2 విన్న‌ర్ రేసులోనికి దూసుకెళ్లింది.

గొప్ప వ్య‌క్తిత్త‌వం ఉన్న వ్య‌క్తి గీతా.. అంటూ సోష‌ల్ మీడియాలో వేల సంఖ్య‌లో కామెంట్లు పెడుతున్నారు. అదే కామెంట్ల‌తో పాటూ తేజ‌స్విని బిగ్‌బాస్ హౌస్‌లోంచి బ‌య‌ట‌కు పంపిస్తే త‌ప్ప తాము చూడ‌లేమంటూ.. వేల సంఖ్య‌లో ట్రోల్స్ పెడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆ ముఖం చూడాలంటేనే కంప‌ర‌మెత్తుతోంది, అస‌హ్యం వేస్తోంది.. ద‌రిద్రంగా ఉందంటూ ప‌చ్చిగా కామెంట్లు పెడుతున్నారిప్పుడు. బిగ్‌బాస్ చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు అర్థం కానిది ఒక్క‌టే.. టాస్క్‌లో భాగంగా సామ్రాట్‌, త‌నిష్‌లు హౌస్‌లో ఉన్న అమ్మాయిలంద‌రినీ వాళ్ల ప్రైవేట్ పార్ట్‌లను ట‌చ్ చేస్తూనే.. ఎత్తుకెళ్లిపోవ‌డం, లాగిప‌డేయ‌డం చేస్తూ.. అత్యంత హేయంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కానీ.. వాళ్లు తేజ‌స్వికి ఫ్రెండ్స్ కావ‌డంతో ఒక్క మాట ఎవ‌రూ ఆడ‌డం లేదు. కానీ.. కౌశ‌ల్ పొర‌పాటున త‌గ‌ల‌కుండానే త‌గిలిందంటూ.. ఇంత యాగీ చెయ్యాలా.. అనేదే అర్థం కావ‌డం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -