Saturday, May 4, 2024
- Advertisement -

రేప్ బాధితిరాలి జుట్టు కత్తిరించి ఊరంతా తిప్పిన పంచాయితీ పెద్దలు

- Advertisement -

దేశం అడ్వాన్స్ అవుతున్నా సభ్యసమాజం తలదించుకొనే రీతిలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు పంచాయితీ పెద్దలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని బాధితులకే శిక్షవిధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటివల ఓ గ్రామంలో గ్రామ పంచాయితీ పెద్దలే బాలికను విపరీతంగా కాళ్లతో తన్ని గాయాలపాలు చేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన బీహార్‌లోని గయా ప్రాంతంలో చోటుసుకుంది. నాపై అత్యాచరాం చేశారని బాధితారాలు పంచాయితీ పెద్దలకు మొర పెట్టుకున్నా వినకుండా దానికి కారణం నువ్వే అంటూ యువతి వెట్రుకలు కత్తిరించి ఊరంతా తప్పిన అమానావీయ ఘటన చోటుచేసుకుంది

బీహార్‌ గయా జిల్లాలోని కాప్ గ్రామంలో ఓ మైనర్ బాలికను ఆరుగురు యువకులు బలవంతంగా అత్యాచారం చేశారు. బాలికను వాహనంలోకి లాగి మత్తుమందు చల్లి తమ వాహనంలో తీసుకువెళ్లిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని తన బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి దండ్రులతో పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

న్యాయం చేయాల్సిన పంచాయితీ పెద్దలు నిందితులను శిక్షించకుండా.. ఆ బాలికదే తప్పని నిందించారు. గా అందుకు కారణమైన యువతిని వెంట్రుకలు కత్తిరించి ,గ్రామామంతా తిరగాలని ఆదేశించారు.దీంతో బాలిక తల్లిదండ్రులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. ఆరుగురు నిందితులతోపాటు ఐదుగురు పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -