Thursday, May 2, 2024
- Advertisement -

ద్రవిడ్ కు మినహాయింపులేదు…వివరణ ఇవ్వాల్సిందే : డీకే జైన్

- Advertisement -

క్రికెట్ లో విరుద్ధ ప్రయోజనాల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ హోదాలో ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రవిడ్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌నకి వైస్ ప్రెసిడెంట్‌గానూ ఉండటంపై బీసీసీఐకి సంజయ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ 26న ‘విరుద్ధ ప్రయోజనాల’ అంశంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ ఆదేశాలు జారీ చేశారు.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బోర్డు పరిధిలో ఒక వ్యక్తి కేవలం ఒక పదవిలో మాత్రమే ఉండాలి. ద్రవిడ్ కు నోటీసులు అందించడంపై భారత మాజీ క్రికెటర్లు ఇటీవల పెద్ద ఎత్తున విమర్శించారు.సౌరవ్ గంగూలీ అయితే.. భారత క్రికెట్‌ని ఇక ఆ దేవుడే కాపాడాలి అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లకి కూడా విరుద్ధ ప్రయోజనాల అంశం కింద డీకే జైన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

రాహుల్ ద్రవిడ్‌ని ఎన్‌సీఏ డైరెక్టర్‌గా తాము అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే నియమించామని.. అతని తరఫున తాము వివరణ ఇస్తామంటూ ఇటీవల బీసీసీఐ పాలకుల కమిటీ మద్దతు తెలిపింది. ఇది ద్రవిడ్ కు ఊరటనిచ్చే అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -