పవన్ కళ్యాణ్ పై బిజెపి విమర్శల పరంపర కొనసాగుతోంది. కాకినాడలో పవన్ కళ్యాణ్ బిజెపి పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.ప్రత్యేక హోదా విషయం లో ఆయన ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తీరుపై విరుచుకుపడ్డారు. దీనితో బిజెపి పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తోంది.ఈ విషయం లో టిడిపి ఎంపీలపైనా పవన్ విమర్శలు చేశారు.
కానీ టిడిపి నేతలు పవన్ ని విమర్శించలేదు. చంద్రబాబు టిడిపి నేతలకు పవన్ ను విమర్శించవద్దని ఆదేశించినట్లు సమాచారం. కానీ పవన్ కాకినాడ సభ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా పవన్ పై బిజెపి విమర్శల వర్షం మాత్రం ఆగడం లేదు.
ప్రతి జిల్లా బిజెపి అధ్యక్షులు పవన్ ని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.పవన్ మాత్రం దీనికంతటికి కారణం వెంకయ్య నాయుడు అని పవన్ కాకినాడ సభ అనంతరం జరిగిన ఇంటర్వ్యూ లలో తెలిపాడు. పవన్ ఒకరకంగా ఎన్డీఏ లో భాగస్వామి. కానీ బిజెపి నేతలు మాత్రంపవన్ విషయంలో తెగేదాకా లాగ దలుచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Related