Friday, May 24, 2024
- Advertisement -

బీజేపీ కి హ్యాండ్ ఇచ్చి , కాంగ్రెస్ లోకి జంప్ చెయ్యబోతున్న .. రెబెల్ స్టార్ ?

- Advertisement -

మన రెబెల్ స్టార్ కృష్ణం రాజు కాదు లెండి, ఇక్కడ చెప్పేది బాలీవుడ్ రెబెల్ స్టార్ – షాట్ గన్ శత్రుఘ్న సిన్హా గురించి .. ఆయన వ్యవహార శైలి ఈ మధ్య కాలం లో బీజేపీ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సీనియర్ బీజేపీ నాయకులు ఆయన ప్రవర్తన పట్ల చాలా విముకతంగా గా ఉన్నారు.

బీజేపీ ఎంపీ అయిన శత్రుఘ్న సిన్హా మొదటి నుంచీ బీజేపీ నే ఇరకాటం లో పెట్టె వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా కాంగ్రెస్ వారితో ఎక్కువగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని అనువుగా తీసుకుని రంగంలోకి దిగింది. ఇప్పటికే సిన్హా తో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు జరిపారు అని సమాచారం. ఆ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత రణ దీప సుర్జేవాలా సిన్హా తో భేటీ అయి సంచలనం సృష్టించారు. ఈ విషయం మీద మీడియా తో మాట్లాడుతూ ఆయన మంచి స్నేహితుడు కావడం తో కలిసాను అని అంతకు మించి విశేషం ఏమీ లేదు అని చెప్పినా ఇలాంటి కహానీలు వినీ వినీ జనం విసుగు ఎత్తి పోయారు. రాజకీయ చర్చల కోసం కలవడం ” అబ్బే అలాంటిది ఏమీ లేదు, కుశల ప్రశ్నలు అడగడం కోసం కలిసాను ” అంటూ చెప్పడం రాజకీయనాయకులకి కొత్తేమీ కాదు. నిజానికి రాహుల్ గాంధీ స్వయంగా ఆయన్ని కలవాల్సి ఉన్నా మీడియా హడావిడి ఊహించి కేవలం ఫోన్ లో స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ విషయం మీద బీజేపీ కూడా కంగారు గానే ఉంది. అవడానికి తలనొప్పి కాండిడేట్ ఏ కానీ చూస్తూ చూస్తూ ఒక ఎంపీ సీటు వదులుకోవడం బీజేపీ కి ఇష్టం లేదు. ఈ విషయం అధిష్టానం సూటిగా సిన్హా ని అడిగేసింది. ‘ఏం జరుగుతోంది.? పార్టీ మారే ఉద్దేశ్యం ఏదైనా వుందా.?’ అని శతృఘన్‌ని అడిగారట. దానికి శతృఘన్‌, ‘నన్ను అనుమానిస్తున్నారా.? ఇలాగైతే బీజేపీలో వుండడం కష్టం..’ అని తేల్చేశారట. ‘అనుమానం ఏమీ లేదు, కాంగ్రెస్‌ నుంచి దుష్ప్రచారం జరుగుతోంది కదా..’ అని శత్రుఘ్న సిన్హాని మెత్తబరిచే ప్రయత్నాలు షురూ చేసింది బీజేపీ అధిష్టానం. మరొక పక్క ఆయన ఖచ్చితంగా మారతాడు అని వార్తలు బీజేపీ సీనియర్ నేతల చెవుల్లో పడ్డం తో ఆయన ఉండడం కంటే మారితేనే తమకి లాభం అని కొత్త పల్లవి ఎత్తుకున్నారు బీజేపీ వారు. “ఆయన ఉంటే ఏ పార్టీ కైనా నష్టమే , ఇప్పుడు ఆ నష్టం కాంగ్రెస్ కి కలుగుతుంది అంటే మాకు ఇంకా సంతోషమే కదా ? ” అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ. దసరా తరవాత భవిష్యత్ కార్యాచరణ పైన సిన్హా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -