కన్నడ హీరోయిన్ , మాజీ ఎంపీ రమ్య కి ఈ మధ్య ఊహించని పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. తన మీద వస్తున్న విమర్సలకి ఆమె తట్టుకోలేక కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ ఏం కృష్ణ దగ్గర చెప్పుకుని మరీ రమ్య కంట కన్నీరు పెట్టుకుంది.
రాహుల్ పర్యటన లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం కోసం కేపీసీవీ తరఫున చెక్కు అందజేసిన రమ్య మీద తీవ్రమైన నిరసన ఉంది. ఈ విషయం లో ఆమె చాలా కలత చెంది ఎస్ ఏం కృష్ణ ని కలిసారు. రైతుల కుటుంబానికి తాను ఇచ్చిన చెక్కు విషయం లో తాను ఎవరి మీద ఫిర్యాదు చెయ్యలేదు అని కానీ తనమీద విమర్శలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది అని వాపోయింది ఆమె. రాజకీయ ప్రత్యర్ధులు ఆమె మీద ఈ విషయం లో కావాలనే రాద్దాంతం చేస్తున్నారు అని ఆయన వద్ద ఏడ్చేసింది రమ్య,. అసలు తనకి రాజకీయాల మీద విరక్తి వచ్చేస్తోంది అని ఇలా ఉంటే రాజకీయాలలో కొనసాగడం చాలా కష్టం అని ఈ రకమైన పరిస్థిత వస్తుంది అని అనుకోలేదు అని ఆమె ఆయనతో చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమేనని, అన్ని పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు ఆయన. కన్నీళ్ళతో బయటకి వచ్చిన రమ్య తనకి ఎమ్మెల్సీ కావాలనో, మంత్రి పదవి కావాలనో అక్కడకి రాలేదని మీడియా తో చెప్పారు.
