Saturday, May 3, 2025
- Advertisement -

జైల్లో స‌ల్మాన్ దోస్త్ ఎవ‌రంటే …?

- Advertisement -

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దోషిగా తేలడంతో ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది జోద్‌పూర్‌కోర్టు. దీంతో ఆయనను పోలీసులు కోర్టు నుంచి భారీ భద్రత నడుమ జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలుకి తరలించారు. కాగా, ఇదే జైలులో 2006లోనూ సల్మాన్‌ ఖాన్‌ ఐదు రోజులు ఉన్నాడు. ఇప్పుడు అదే జైలులో బ్యారక్‌ నంబర్‌ 2లో ఆయనకు జైలు గదిని కేటాయించారు.

ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటోన్న స్వామిజీ ఆశారాం బాపు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఆశారాం బాపుపై 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అరెస్టు అయిన ఆయన ఐదేళ్లుగా ఇదే జైల్లో ఉంటున్నారని ఓ అధికారి తెలిపారు.

ఇక శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌ రేపు ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఇవాళ రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -