Friday, May 10, 2024
- Advertisement -

హైదరాబాద్ లో బ్లూ ఫిలింలు చూడటం కష్టమే ఇక..!

- Advertisement -

హైదరాబాద్ నగరంలో ఉన్న నీలిచిత్ర ప్రియులకు ఇది దుర్వార్తే. సరదాగానో.. పొద్దు పోకనో.. ఆసక్తి కొద్దో నీలి చిత్రాలను చూసే వారికి ఇకపై అలాంటి సరదాలు ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్ని నిర్ణయం..

పోలీసులు ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరులను గమనిస్తే.. ఈ విషయంపై స్పష్టత వస్తోంది.

మొత్తం  ఐదు వేల నీలిచిత్రాల సైట్లను గుర్తించారట సైబర్ క్రైమ్ పోలీసులు. ఇంటర్నెట్ లో ఇవన్నీ అసభ్యకరమైన కంటెంట్ ను, వీడియోలను అందిస్తున్నాయని.. వారు పేర్కొన్నారు. వీటిని అరికట్టడానికి చర్యలకు వారు సిద్ధం అవుతున్నారు. ఆ ఐదువేల సైట్లకూ 1,400 బేస్ సైట్లు ఉన్నాయని తెలుస్తోంది. 

వీటిపై ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. 2000 సంవత్సరంలో రూపొందించిన ఐటీ చట్టం సెక్షన్ 69 కింద వీటిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసి.. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చి.. న్యాయస్థానం చర్యలకు ఆదేశిస్తే.. పోర్న్ సైట్లు దాదాపుగా బ్లాక్ అయిపోయినట్టే.

ఇంతకు ముందే సుప్రీం కోర్టులో కూడా ఈ నీలి వీడియోల వ్యవహారం పై విచారణ జరిగింది. వీటికి అడ్డుకట్ట వేయాలని అప్పట్లోనే కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరచూపి.. పోర్న్ సైట్లకు కళ్లెం వేసే దిశగా ముందుకువెళుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -