Monday, April 29, 2024
- Advertisement -

సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అయితే ఇది తాను తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన‌ది కాదులేండి. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా టైటిల్‌ను తెలుగులో విడుద‌ల చేశారు రాజ‌మౌళి. కరణ్ జోహార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోను తెలుగులో రిలీజ్ చేశారు రాజమౌళి.

‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ టైటిల్ లోగో ను లాంచ్ చేసిన రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘బ్రహ్మాస్త్ర’ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్,అమితాబ్ బచ్చన్,అలియా భట్,డింపుల్ కపాడియా వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మ‌న కింగ్ నాగ‌ర్జున కూడా ఓ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్‌లో విడుదల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -