అమెరికా. యువతకు ఎంతో ఇష్టమైన దేశం. అంతే కాదు. కలల ప్రపంచం కూడా అదే. అలాంటి అమెరికా మన గుప్పెట్లో చిక్కితే.. ఆ కిక్కే వేరబ్బా. ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా. ఏం లేదు.. వేసవి కాలంలో యువతని.. ఆమాటకొస్తే అందరిని అలరించిన బడ్వైజర్ బీర్ ఇప్పుడు పేరు మార్చుకుంది. కొత్త పేరు ఏమిటా అనుకుంటున్నారా.
అదే అమెరికా. ఈ నెల 23 వ తేది నుంచి బడ్వైజర్ పేరు మారుతోందని, అమెరికాను చేత్తో పట్టుకుని తాగవచ్చునని కంపెనీ ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పేరు మార్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీరు క్యాన్లు, బాటిళ్ల మీద స్టాట్యూ ఆఫ్ లిబర్టి బొమ్మను కూడా ముద్రించనున్నారు.
అంతే కాదు ‘అమెరికా ద బ్యూటిఫుల్’, ‘ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్’ లాంటి పాటల సాహిత్యం కూడా వాటి మీద ముద్రిస్తున్నారు.ఈ పేరును 2016 రియో ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్ వరకు కూడా కొనసాగిస్తారు. ఇంతకీ ఈ కంపెనీ యజమాని ఎవరో తెలుసా… ఆన్‌హ్యూసర్- బష్ ఇన్‌బెవ్ అనే బెల్జియం కంపెనీయే దీని యజమాని.
