Saturday, May 18, 2024
- Advertisement -

ఏడుగురికి యావజ్జీవ ఖైదు

- Advertisement -

పావులతో యువతులను బెదిరించి అకృత్యాలకు పాల్పడిన దోషులకు రంగారెడ్డి జిల్లా కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ గ్యాంగ్ లో ఎనిమిది మంది సభ్యులుంటే వారిలో ఏడుగురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ఎనిమిదో నిందితుడు ఆలీకి 20 నెలల జైలు శిక్షను విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. వీరిని దోషులుగా మంగళవారం నాడు నిర్ధారించిన కోర్టు శిక్షను మాత్రం బుధవారం నాడు ఖరారు చేసింది.

రెండేళ్ల క్రితం ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగుచూసాయి. పహాడిషరిఫ్ పోలీస్ స్టేషన్ లో తొమ్మిది మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా 37 మంది యువతులను పావులతో బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దోషులుగా తేలిన వారిలో ప్రధాన నిందితుడు పైసల్ దయానీ, ఖాదర్ బర్కబా, తయాబ్ బస్లామా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం, అలీ బారక్‌బా ఉన్నారు. ఈ ముఠాలో మిగిలిన సలాం హమ్దీపై నేరం రుజువు కాకపోవడంతో అతడిని నిర్దోషిగా విడుదల చేశారు. స్నేక్ గ్యాంగ్ దోషులు చర్లపల్లి జైలులో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -