Tuesday, May 14, 2024
- Advertisement -

కేసీఆర్‌కు బ‌ర్నింగ్ స్టార్ ఫిదా

- Advertisement -
  • తెలంగాణ సీఎంను క‌లిసిన సంపూర్ణేశ్ బాబు

ఒక్క సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన సంపూర్ణేశ్ బాబు అభిమానుల‌ను తెగ సంపాదించేశాడు. ఎవ‌రూ సాధించ‌లేని సంపూ ఒకే ఒక్క సినిమాతో సాధించాడు. అత‌డు సినీ ప‌రిశ్ర‌మ‌కు హృద‌య కాలేయం సినిమాతో ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అందులో సంపూర్ణేశ్ న‌ట‌న‌కు, ఆ క‌థ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. క‌ష్టాల నుంచి వ‌చ్చిన న‌టుడు సంపూ. అత‌డి న‌ట‌న ఎలా ఉన్నా అత‌డి ఎదుగుద‌ల‌ను అంద‌రూ కోరుకున్నారు. అంద‌రీ ఆద‌ర‌ణ‌తో ఇప్పుడు న‌టుడుగా కొన‌సాగుతున్నాడు. అత‌డి సినిమాలేవి విజ‌యం సాధించ‌కున్నా అవ‌కాశాలైతే వ‌స్తున్నాయి.

అత‌డు ప్ర‌స్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫిదా అయిపోతున్నాడు. నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవడం నా కల…ఆ కల ఇన్నేళ్ల‌కి సాకారం అయింది అని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. సంపూర్ణేశ్‌బాబుకు కేసీఆర్ అంటే అభిమానం. ఇద్ద‌రికి ఒక‌టే జిల్లా సిద్ధిపేట‌. ఈ సంద‌ర్భంగా ఎన్నో రోజుల నుంచి కేసీఆర్‌ను క‌ల‌వాల‌నుకుంటున్న సంపూకు వీలు చిక్క‌లేదు. ఇటీవ‌ల ఆ అవ‌కాశం దొర‌క‌డంతో వాలిపోయాడు. సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి మాట్లాడాడు. కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -