Monday, April 29, 2024
- Advertisement -

స్టెప్పులేసిన విరుష్క జోడి

- Advertisement -
  • ఘ‌నంగా జ‌హీర్‌, సాగ‌రిక రిసెప్ష‌న్‌
  • హాజ‌రైన సినీ, క్రీడా ప్ర‌ముఖులు

ఇద్ద‌రు క‌లిస్తే హుషారుగా ఉంటారు. ఇన్ని రోజులు ఉన్న ప్రేమ విష‌యం బ‌హిరంగమ‌వ‌డంతో ఇక ఏ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లినా ఇద్ద‌రు జంట‌గా వెళ్తున్నారు. ఎవ‌రు ఏమీ అనుకుంటే ఏం మా ప‌ని మేం చేస్కుంటామ‌ని నిరూపిస్తోంది విరుష్క జోడి. అదేనండి భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్కశ‌ర్మ‌ జంట‌. వీరిద్ద‌రూ మ‌ళ్లీ సంద‌డి చేశారు. ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పులేశారు.

భారత మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ వివాహం ఈ నెల 23వ తేదీన బాలీవుడ్‌ భామ సాగరికతో నిరాడంబరంగా జరిగింది. అప్పటి నుంచి ఈ జంట.. బంధువులకు, స్నేహితులకు ప్రత్యేక విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ముంబయిలోని తాజ్‌ లాండ్స్‌లో జహీర్‌ఖాన్‌, సాగరిక రిసెప్షన్‌ ఘనంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు కోహ్లీ-అనుష్క శర్మ జోడీ హాజరై సంద‌డి చేసింది. కొత్త దంప‌తుల‌తో విరుష్క జోడీ డ్యాన్స్ చేశారు. కోహ్లీ ఉత్సాహంగా స్టెప్పులేస్తూ హుషారుగా గ‌డిపాడు. ఈ వీడియోను కోహ్లీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఈ వేడుక‌కు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఆశిష్‌ నెహ్రా, యువరాజ్‌ సింగ్‌తో పాటు అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌, టెన్నీస్ తార సానియా మీర్జా, పలువురు బాలీవుడ్ న‌టులు హాజరయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -