Thursday, May 23, 2024
- Advertisement -

ప్ర‌పంచంలో గంజాయిని చ‌ట్ట‌బ‌ద్దం చేసిన రెండో దేశం ..

- Advertisement -

గంజాయి అమ్మకాలను కెనడా చట్టబద్ధం చేసింది. ఉరుగ్వే తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న రెండో దేశం కెనడా కావడం విశేషం. గంజాయి అమ్మకంపై నిషేధం ఎత్తివేస్తామని 2015 ఎన్నికల ముందు ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా గత జూన్లో సెనెట్ బిల్లును ఆమోదించింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా కెనడాలో 30 గ్రాముల లోపు గంజాయి తీసుకెళ్లొచ్చు. ప్రజలెవరైనా ఇంట్లో నాలుగు గంజాయి మొక్కలు సాగు చేసుకోవచ్చు. తొలినాళ్లలో కొన్ని స్టోర్లలో మాత్రమే గంజాయి అందుబాటులో ఉండనుంది.

గంజాయి అమ్మకాన్ని చట్టబద్ధం చేయడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి 400 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. కెనడాలో గంజాయి సాగుపై 1923లో నిషేధం విధించారు. కానీ వైద్య అవసరాల కోసం వాడుకోవడానికి వీలుగా 2001లో చట్టం తీసుకొచ్చారు.18 ఏళ్లు నిండిన ఎవరైనా గంజాయి కొనుగోలు కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ ఇచ్చి.. గరిష్టంగా నెలకు 40 గ్రాముల చొప్పున గంజాయిని కొనుగోలు చేయొచ్చు. గంజాయిని చట్టబద్ధం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -