Monday, May 5, 2025
- Advertisement -

నేత్రావతి నదిలో శవంగా తేలిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ..

- Advertisement -

కనిపించకుండా పోయిన కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ నేత్రావతి నదిలో శవమై తేలాడు. రెండు రోజులక్రితం మంగుళూరులోని నేత్రావతి నది వద్ద అతను కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆయన కోసం సుమారు 300మందికిపైగా గజ ఈతగాళ్లు వెతికారు. ఎట్టకేలకు ఇవాళ తెల్లవారుజామున సిద్ధార్థ మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆతర్వాత కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులకు కారు డ్రైవర్‌ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఉద్యోగులు, సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు సిద్ధార్థ రాసిన లేఖ బయటపడిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -