Monday, April 29, 2024
- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో జక్కన్న టీం

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న విజువల్ వండర్, క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, తమిళ విలక్షణ నటుడు సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి మెలోడీ మాస్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఈ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను మళ్ళీ మొదలు పెట్టింది జక్కన్న టీమ్. ఇప్పటికే ముంబై, కేరళలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఇదే ఊపులో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

ఈ సారి బెంగళూర్ వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరపబోతున్నట్లు సమాచారం. ఈ నెల 20న బెంగళూర్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ ఈవెంట్ ను భారీ ఎత్తున జరపబోతున్నట్టు టాక్. అలాగే.. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి.

కొత్త వ్యాపారంలోకి నాగచైతన్య.. స్పందించిన వెంకటేశ్ కుమార్తె

బాలీవుడ్ బ్యూటీతో లవ్‌లో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?

బాహుబలి 3 రాబోతోందా? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -