దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన జీఎస్టీ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళలను కించపరిచే విధంగా చిత్రాన్ని తీశారని మహిళా సంఘాలు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. వర్మపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. విచారణలో పలు ప్రశ్నలు సంధించిన పోలీసులు కేసు సాధారనమైనదికాదని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు.
ఈ కేసును సాదాసీదాగా విచారించలేమని టెక్నికల్‌గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో 50 శాతం కోర్టులో రుజువయ్యాయని చెప్పారు.
ఆయనను అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.