Wednesday, May 7, 2025
- Advertisement -

రాహుల్ గాంధీకి హోమంత్రిత్వ‌శాఖ నోటీసులు….

- Advertisement -

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది.రాహుల్‌ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది.గాంధీ రెండు దేశాలు బ్రిటన్, భారత్ పౌరసత్వాలు కలిగి ఉన్నారంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి… రాహుల్ పౌరసత్వాలపై కేంద్ర హోంశాఖకు ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో రాహుల్‌కు నోటీసులు జారీ చేసిన హోంశాఖ… రెండు వారాల్లో పౌరసత్వంపై వివరణ ఇవ్వాలని కోరింది.

సుబ్రమణ్యస్వామి తన ఫిర్యాదులో.. ‘2003లో యూకేలో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యింది. దానికి డైరెక్టర్, సెక్రటరీ హోదాలో రాహుల్ ఉన్నారు. అయితే, కంపెనీ వార్షిక రిటర్ను దాఖలులో భాగంగా రాహుల్ తన జాతీయతను బ్రిటిష్‌గా నమోదు చేశారు’ అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -