Sunday, May 12, 2024
- Advertisement -

చంద్రబాబు అట్టర్ ప్లాప్ – ఆ పిచ్చి తగ్గించుకోవయ్యా !

- Advertisement -
Chandrababu Naidu On Ap Purse

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం లో అన్నింటా ఏపీ ని ముందంజ లో నిలబెట్టి నెంబర్ 1 ప్లేస్ ని కట్టబెడతాం అంటారు కానీ అవినీతి , అప్పులు విషయం లో తప్ప ఎందులోనూ ఇది కుదరడం లేదు. డిజిటల్ మనీ విషయం లో ఎలాగైనా ఏపీ ని నెంబర్ వన్ చెయ్యాలి అని కొత్త కంకణం కట్టుకున్నారు ఏపీ పార్స్ అంటూ ఎదో యాప్ ని సైతం విడుదల చేసారు కానీ అసలు ఏమీ వర్క్ అవ్వడం లేదు. క్యాష్ లెస్ ఎకానమీ అనగానే చంద్రబాబు ఏపీ గవర్నమెంటు నుంచి వ్యాలట్ అందుబాటులోకి తెస్తున్నామంటూ ఏపీ పర్సు పేరుతో లాంచ్ చేశారు.

హైటెక్ చంద్రబాబు చేశారంటే అది అద్భుతంగా ఉండొచ్చని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అది డిజిటల్ మనీ వ్యాలట్ కాదు.. అలాంటి వ్యాలట్లు – బ్యాంకు యాప్ లు అన్నీ ఒక్క చోట లింక్ చేస్తూ ఇచ్చిన అతి సాధారణ యాప్. అందులో పేటీఎం – మొబిక్విక్ వంటి వ్యాలట్లు.. బ్యాంకుల యాప్ లు ఉంటాయి. మనకు కావాల్సింది క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది.  ఆ యాప్ ను వాడుకోవాలి. దాని కోసం ఏపీ పర్సే ఎందుకో… ప్లేస్టోర్ నుంచి డైరెక్టుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అది సురక్షితం కూడా.ఇక పెన్షన్లు – రేషన్ వంటివన్నీ ఆన్ లైన్ చేస్తామంటున్నారు చంద్రబాబు. మరి… అవి కూడా ఏపీ పర్సు మాదిరిగానే ఉంటాయో లేదంటే ప్రయోజనకరంగా ఉంటాయో చూడాలి. నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అంటూ ఉపయోగం లేని పనులు చేసే కంటే కాస్త ఆలస్యమైనా ప్రజలకు ఉపయోగపడేలా చేయడం బెటర్. చంద్రబాబుకు ఈ ఫస్ట్ పిచ్చి ఉన్నంత కాలం అలాంటి రోజులు వచ్చేలా లేవు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -