Sunday, May 11, 2025
- Advertisement -

గుర‌వింద గింజ నీతి బాబుకు తెలియదా…?

- Advertisement -
Chandrababu says will guilty will be punished

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక్క‌డే నిప్పు అనేలాగ మాట్లాడ‌టం ప్యాస‌న్ అయిపోయింది.ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌మీద తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.త‌ప్పు చేసిన‌వారికి శిక్ష త‌ప్ప‌ద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షంలో నాయకత్వ శూన్యత ఉందని అన్నారు. ప్రతిపక్షంలో గట్టి పార్టీలు లేవని అభిప్రాయపడ్డారు.త‌ప్పుచేసిన వారు ఎవ‌రికైనా శిక్ష‌త‌ప్ప‌దు.అంత వ‌ర‌కు బాగానే ఉంది బాబు నీతులు.

{loadmodule mod_custom,GA1}

మ‌రి గుర‌వింద‌గింజ నీతి బాబు గుర్తుపెట్టుకుంటె మంచిది.చేసిన తప్పుకు శిక్షపడటం అన్నది ఒక్క జగన్ కు మాత్రమేనా లేక తప్పెవరు చేసినా శిక్ష పడాల్సిందేనా…? ప్రతీ ఒక్కరికీ శిక్ష తప్పదనుకుంటే మరి, చంద్రబాబుకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా … మ‌రి చంద్ర‌బాబు మ‌రిచారా…?
ఓటుకునోటు కేసు ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలుసు. ఈ కేసులో అధికారపార్టీ ఎంఎల్ఏల ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నంలో దొరికిపోయారు కదా? పాత్రదారులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు ఇప్పటికే రిమాండ్ కు వెళ్ళి బెయిలుపై బయట తిరుగుతున్నారు. మరి సూత్రదారుల సంగతేంటి? కేసులో అడ్డంగా బాబు బుక్ అయ్యారు. తనపై కేసు విచారణ జరగకుండా స్టే మీద కొనసాగుతున్న చంద్రబాబు పాత్రేమిటో అందరికీ తెలిసిందే.

{loadmodule mod_custom,GA2}

కేసులో విచారణ ఎదుర్కోవటానికి సిద్దపడటం లేదన్నా, విచారణ కొనసాగకుండా అడ్డుపడుతున్నా ఇక్కడ మ్యాటరేంటో క్లియర్ గా అర్ధమైపోతోంది అందరికీ. అంటే చంద్రబాబు కూడా తప్పుచేసినట్లే కదా? ఆయన మాటలను బట్టి చూస్తే చంద్రబాబుకు కూడా శిక్ష తప్పదనే అర్ధం. గురివిందగింజ పద్దతిలో తనక్రింద తప్పులు పెట్టుకుని ఎదుటివారి తప్పులు మాత్రమే ఎత్తి చూపటంలో అర్ధమేంటి.నేను ఇస్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే చెల్లుతుంద‌నే అహం బాబులో ఎక్కువే.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}GSI0rM5bPUQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -