భారత సైన్యం జరిపిన దాడులతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మన జవాన్లు బాలాకోట్, ముజఫరాబాద్, చకోటి, ప్రాంతాల్లో దాడులు జరిపి 300 మందిని తీవ్రవాదులు చంపారు. ఈ దాడులతో పాక్ బెంబేలెత్తిపోయింది. దీంతో మన శత్రు దేశం అయిన చైనాతో సంప్రదింపులు జరిపి, తమకు సాయం చేయలని కోరింది పాక్. చైనా సాయంతో భారత్‌పై యుద్ధం చేద్దాం అనుకున్న పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది చైనా. భారత సైన్యం పాకిస్థాన్‌లోకి చొరబడి దాడులు చేసిందని చైనాకు ఫిర్యాదు చేసిన పాక్ , ఇండియాపై దాడులు చేసేందుకు సహాకరించాలని చైనాను కోరింది.
అయితే భారత్‌తో యుద్దనాకి చైనా అంగీకరించలేదని సమాచారం. మన వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ ‘క్సిన్హువా’ స్వయంగా వెల్లడించింది. ఈ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చైనా భావిస్తున్నట్లు సమాచారం.