Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అక్కడ కనిపించింది..!

- Advertisement -

శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకొని సంచలన రీతిలో వార్తల్లోకి వచ్చిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ తర్వాత విడాకుల సమయంలో వార్తల్లోకి కూడా వచ్చిన విషయం విదితమే.

మెట్టినింటి వారి వేధింపులు భరించలేక ఆమె వివాహ బంధాన్ని చట్టబద్దంగా రద్దు చేసుకొంది. మరి ఆ తర్వాత మళ్లీ మీడియా ముందు కనిపించని శ్రీజ ఇప్పుడు అనుకోకుండా వార్తల్లోకి వచ్చింది.

ఆమె లండన్ లో డిగ్రీని పూర్తి చేసుకొన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ లో అమె డిగ్రీని అందుకొంది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య కూడా పాల్గొనడం విశేషం. వీరిద్దరూ ఆ కార్యక్రమానికి హాజరై.. తమ కూతురితో అనందాన్ని పంచుకొన్నారు. ప్రసిద్ధ కొవెంట్రీ యూనివర్సిటీ లండన్ క్యాంపస్ లో శ్రీజ డిగ్రీని పూర్తి చేసుకొంది. 

మరి వైవాహిక బంధం విఫలం అయిన తర్వాత చిరంజీవి కూతురు చదువు మీద దృష్టి పెట్టి ఇలా డిగ్రీ ని పూర్తి చేయడం విశేషమే. మరి కూతురా కాన్వొకేషన్ కోసం లండన్ వెళ్లిన మెగాస్టార్ అక్కడ తన బాడీ ఫిట్ నెస్ విషయంలో కూడా చికిత్సలు తీసుకొన్నట్టుగా తెలుస్తోంది. 150 సినిమాకు ప్రిపరేషన్ లో భాగంగా మెగాస్టార్ కొన్ని థెరపీలతో బాడీమెయింటెయినెన్స్ పై దృష్టి సారించినట్టు సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -