Thursday, May 2, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప‌నితీరుపై ప్రశంస‌లు కురిపిస్తున్న అధికారులు..

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌పై బాబు కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో నాకంటె సీనియ‌ర్ ఎవ‌రూ లేరంటూనె జ‌గ‌న్‌కు ఏ అనుభ‌వం ఉంది సీఎంగా ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వాలి త‌మ్ముళ్లూ అంటూ ప్ర‌శ్నించారు. అనుభ‌వం లేని జ‌గ‌న్‌కు అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంటూ అడ్డ‌గోలు వ్యాఖ్య‌ల‌కు తెరలేపారు. కాని బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. జ‌గ‌న్ కు ఒక్క సారి అధికారం ఇవ్వాల‌నుకున్నారు అంతే..పార్టీకి అఖండ మెజారిటీ క‌ట్ట‌బెట్టారు.

ఇప్పుడు అదే అనుభవం లేని జగన్.. ఏపీ సీఎంగా తక్కువ కాలంలోనే అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎలాంటి శషభిషలు లేకుండానే.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొద‌టి కేబినేట్ స‌మావేశంలోనె త‌న మార్క్ ప‌రిపాల‌న అంటే ఏంటో మాటల్లో కాదు చేత‌ల్లో చూపించారు. ఎలాంటి శషభిషలు లేకుండానే.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

తాజాగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో త‌న ప‌రిపాల‌న ఎలా ఉండాల‌నో అధికారుల‌కు వివ‌రించారు. జగన్ దూకుడు, అవగాహన, ఓ అంశంపై వివరాలు తెలుసుకునే విధానం, వేసే ప్రశ్నల పరంపర చూసి ఐఏఎస్ అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారట. ఈయన ముఖ్యమంత్రా లేక.. ఐఏఎస్ ఆఫీసరా అని ఆశ్చర్యపోతున్నారట. జగన్ తో కలసి పనిచేస్తుంటే.. ఓ ముఖ్యమంత్రితో కలసి పని చేస్తున్నట్టు లేదంటున్నారు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయ‌న మాట‌లు చూస్తుంటే జ‌గ‌న్ ఎంత క‌మింట్ మెంట్‌తో ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. జగన్ పని తీరు ఐఏఎస్ అధికారులను అంతగా ఆకట్టుకుంటోదట. జ‌గ‌న్‌కు ఏఅనుభ‌వం ఉంద‌న్న బాబోరు మ‌రి ఇప్పుడు ఏం మాట్లాడుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -