ప్రస్తుత రాకీయ నాయకులపై కలెక్సన్ కింగ్ మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని మోహన్‌బాబువ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ మంచి వ్యక్తని, ఆయనకు అంచం అంటే తెలియదని మోహన్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ నన్ను రాజ్యసభకు పంపారు. ఎలాంటి మచ్చా లేకుండా పదవీ కాలాన్ని పూర్తి చేశానని ఆయన తెలిపారు.
సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అని ఆయన అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని మోహన్ బాబు అన్నారు.