- Advertisement -

లండన్ లో ముస్లీములను కలవండి

- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ మీరు లండన్ రావాలి. మా ఇంటికి రావాలి. ఇక్కడ నా భార్య, నా కుమార్తెలు, నా స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ ఉన్నారు. వారందరిని మీరు తప్పక కలవాలి. అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఆహ్వనించారు.

తాను అధికారంలోకి వస్తే ముస్లీములను అమెరికాలోకి అడుగుపెట్టనివ్వనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ట్రంప్, సాదిక్ ఖాన్ ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. యుకెలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాదిక్ ఖాన్ మాట్లాడుతూ ట్రంప్ ని తన ఇంటికి ఆహ్వానించారు. లండన్ ఉన్న బ్రిటీషర్లను ట్రంప్ కలవాలని, వారు కేవలం బ్రిటీషర్లు మాత్రమే కాదని, వారిలో ముస్లీములు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వీరిద్దరికి కొంతకాలంగా వివాదం రాజుకోవడంతో సాదిక్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత వచ్చింది. లండన్ కు ఉన్న గొప్పతనం ట్రంప్ కు తెలియాలని, ఇక్కడ ముస్లీములు, క్రీస్టియన్లు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు అందరూ ఉన్నారని, వారంతా ఒకరిని ఒకరు గౌరవించుకుంటారని సాదిక్ ఖాన్ అన్నారు. తనను సాదిక్  ఇంటికి ఆహ్వానించడంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో కొన్నాళ్లకు కాని తెలియదు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -