వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీకి క్యాడరేలేదు…అన్ని నియేజక వర్గాల్లో ఎలా పోటీచేస్తారనె విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ రాజకీయంగా మరో ముందడుగు పడింది. పవన్ లెక్క కుదిరి ఎట్టకేలకు జనసేన సైనికుల ఎంపిక పూర్తయ్యింది.
గత నాలుగైదు నెలలుగా జనసేన పార్టీ, ‘జనసైనికుల’ ఎంపిక ప్రారంభించిన విషయం విదితమే. సుమారు 60 వేల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే, అందులోంచి 5 వేల మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికె పరీక్షలు పూర్తయ్యాయి…మిగిలింది ఎంపికమాత్రమే.
అయితే రాజకీయాలల్లో సరికొత్త ఆనవాయితీకి పవన్ తెరదీశారనె చెప్పుకోవాలి. ఇప్పటి వురుకు ఏ రాజకీయ పార్టీకూడా ఈ తరహా పరీక్షలు నిర్వహించలేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా పార్టీ తరఫున పనిచేస్తారనీ, అయితే జనసైనికులుగా ఎంపికయ్యేవారికి కొన్ని విశిష్ట లక్షణాలు వుంటాయనీ, వాటి కోసమే ఈ పరీక్ష అన్నది జనసేన పార్టీ వాదన.
5 వేల మంది నిష్ణాతుల ఎంపిక అని చెప్పడం ద్వారా, తెలుగు రాష్ట్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఈ ఐదు వేల మంది అత్యంత కీలక భూమిక పోషించనున్నారన్నమాట. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం, ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే విమర్శలపై స్పందించడం.. ఇవన్నీ జనసైనికుల బాధ్యతలు.
5 వేల మంది జనసైనికుల లెక్క బాగానే వుందిగానీ, ఆ ఐదు వేల మంది ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేసి, ఆ వివరాల్ని ఈపాటికే వెల్లడించి, జనసైనికులుగా వారి బాధ్యతల్ని వారికి అప్పగించేసి వుండాల్సింది. త్వరలోనె పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నందున ఆలోపె జనసేన సైనికుల వివరాలు ప్రకటించే అవకాశాలున్నాయి.