Monday, May 6, 2024
- Advertisement -

బైడెన్ టీకా పంపిణీ పై వివాదాస్పద వ్యాఖ్యలు..!

- Advertisement -

దేశంలో కరోనా వ్యాక్సిన్ల సరఫరా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ యంత్రాంగంపై విమర్శల వర్షం కురిపించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. పంపిణీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అభిప్రాయపడ్డారు.తాను అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం.. రోజుకు మిలియన్​ టీకాలు అందే విధంగా చర్యలు చేపడతానని హామీనిచ్చారు బైడెన్​. అయినప్పటికీ.. అమెరికన్​ జనాభాలో మెజారిటీ మందికి వ్యాక్సిన్​ అందేసరికి నెలలు గడిచిపోతాయన్నారు.

అమెరికాను సరైన మార్గంలో నడిపించేందుకు తాను ఏది చేయడానికైనా సిద్ధమని పునరుద్ఘాటించారు డెమొక్రటిక్​ నేత.అమెరికాలోని కొలొరాడోలో కొత్త రకం కరోనాను గుర్తించారు. బ్రిటన్​లో వెలుగు చూసిన ఈ కరోనా స్ట్రెయిన్​.. అమెరికాలో కనపడటం ఇదే తొలిసారి. 20ఏళ్ల వ్యక్తికి ఈ రకం వైరస్​ సోకినట్టు.. అతను ప్రస్తుతం అసొలేషన్​లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో అతడు ఎక్కడికి ప్రయాణించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -