అనుకున్నట్టే అయ్యింది.. ప్రజావేదికను కూల్చి అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝలిపించిన జగన్ ఇప్పుడు అదే పరంపరంలో కృష్ణ నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసానికి ఎసరు పెట్టారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రజావేదిక పక్కనే లింగమనేని గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. తాజాగా అది అక్రమ నిర్మాణామని.. ఖాళీ చేయాలని చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సీఆర్డీఏ అధికారులు చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ నిర్మాణామని.. వారంలోగా ఖాళీ చేయాలని.. ఆ నిర్మాణం పడగొట్టాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ ను విడిచి అమరావతికి వచ్చిన చంద్రబాబు 2015లో కృష్ణ కరకట్టపై కట్టిన లింగమనేని గెస్ట్ హౌస్ ను తన అధికారిక నివాసంగా అద్దెకు తీసుకొని ఉంచుకున్నారు. ఈ భవనాన్ని ప్రభుత్వ నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆధునిక సౌకర్యాలు.. సీఎం స్థాయి వసతులు కల్పించారు.
ఇక చంద్రబాబు నివాసానికి అటూ ఇటూగా కృష్ణా నది కరకట్టపై దాదాపు 50 నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని వాటన్నింటికి మొత్తానికి నోటీసులు ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. చంద్రబాబుకు కూడా వారం మాత్రమే గడువు ఇవ్వడంతో ఇప్పుడు బాబు ఏం చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కాగా చంద్రబాబు నివాసాన్ని కూలిస్తే దాన్ని కక్షసాధింపు చర్యగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాడుదామని చంద్రబాబు నేతలతో చెప్పినట్టు సమాచారం.
CRDA Issued house demolition notice CRDA Issued house demolition notice CRDA Issued house demolition notice CRDA Issued house demolition notice