Saturday, May 4, 2024
- Advertisement -

బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్

- Advertisement -

క్రికెట్ గ్రౌండ్‌లో మరో ఆటగాడు ప్రాణం వదిలాడు. క్రికెట్ బంతి మెడ వెనుక భాగంలో తగిలి ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ప్రాణాలొదిలిన విషాద ఘటన మరువక ముందే క్రికెట్ గ్రౌండ్‌లో మరో యువ ప్లేయర్ నేలకొరిగాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ దురదృష్టవశాత్తూ హఠాన్మరణం పాలవడం దిగ్భ్రాంతి గొలుపుతోంది.

బంగారు తెలంగాణ క్రికెట్ పోటీల్లో భాగంగా జహీరాబాద్‌లో నిర్వహించిన ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ ఆంథోని హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. అంతకుముందు వరకూ మామూలుగానే బౌలింగ్ చేసిన ఆంథోని ……. ఆ తర్వాత బాల్ వేయడానికి రెడీ అవుతుండగా మెడ వెనుక బంతి తగిలి క్రికెట్ గ్రౌండ్‌లోనే పడిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూజెస్‌లానే ఆంథోని కూడా సడన్‌గా గ్రౌండ్‌పై పడిపోయాడు. ఆ వెంటనే సహచరులు అతనిని హాస్సిటల్‌కి తీసుకెళ్ళారు. అయితే గేం ఆడుతుండగా సడన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఆంథోని చనిపోయాడని డాక్టర్స్ చెప్పారు. క్రికెట్ గ్రౌండ్‌లో ఆటగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -