Sunday, May 4, 2025
- Advertisement -

భార్య‌ స్నేహితురాలిని త‌ల్లిని చేసిన కామాంధుడు..

- Advertisement -

భార్య స్నేహితురాలిపై భ‌ర్త క‌న్నేశాడు. ఇంటికి వ‌చ్చి భార్య స్నేహితురాలికి కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందిచ్చి అత్యాచారం చేశారు. వీడియో తీసి బ్లాక్ మేయిల్ చేస్తూ ప‌లు మార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అప‌రిచితులే కాకుండా బంధువులు, స్నేహితులు కూడా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేకుండా పోతోంది. తాజాగా తమిళనాడులో భార్య స్నేహితురాలిపై ప‌లు మార్లు అత్యాచారం చేయ‌డంతో బిడ్డ‌కు జ‌న్మినిచ్చిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే…తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన సిలంబరసన్‌ (22)కు షర్మిల అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఎడాదిన్న‌ర్ర కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ కిలికోడి గ్రామంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలైన ఓ యువతి తరుచూ వారింటికి వచ్చేది. దీంతో సిలంబరసన్‌ ఆమెపై కన్నేశాడు. ఇంటికి వ‌చ్చిన భార్య స్వేమితి రాలికి కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి అత్యాచారం చే స్తూ ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి బెదిరిస్తూ తరుచూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు.

పర్యవసానంగా గర్భం దాల్చిన బాధితురాలు గత నెల 21న మగశిశువుకు జన్మనిచ్చింది. సిలంబరసన్ బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై పలుమార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని గుమ్మిడిపూండి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -