Sunday, May 5, 2024
- Advertisement -

టీవీ9 రవిప్రకాశ్ భార్య, హీరో శివాజీలకు నోటీసులు అందించిన పోలీసులు

- Advertisement -

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ర‌విప్ర‌కాశ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ర‌విప్ర‌కాశ్‌కు నోటీసులు పంపించారు. అయితే ర‌విప్ర‌కాశ్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన భార్యకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. రేపు తమ ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్‌ను పోలీసులు ఆదేశించారు.

మరోవైపు దర్యాప్తులో భాగంగా టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్‌డిస్క్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. మ‌రో వైపు ర‌విప్ర‌కాశ్‌కు అత్యంత స‌న్నిహితుడైన హారో శివాజీకి కూడా నోటీసులు అందించారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -