Thursday, May 9, 2024
- Advertisement -

టీమ్‌ను రెడీ చేస్తున్న జ‌గ‌న్‌….కీల‌క బాధ్య‌త‌లు ఎవ‌రికంటె..?

- Advertisement -

ఫ‌లితాలు విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అధికార పార్టీ టీడీపీలో ఆందోళ‌నలో ఉంటె…మ‌రో వైపు వైసీపీ గెలుపుపై ధీమాతో ఉంది. వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని బెట్టింగ్ రాయుళ్లు , అన్ని స‌ర్వేలు సైతం నిర్దారిస్తున్న వేల జ‌గ‌న్ త‌న టీమ్‌ను రెడీ చేసె ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ప‌రిపాల‌నా ప‌రంగా అనుభ‌వం లేక‌పోవ‌డంతో సీనియ‌ర్ అధికారుల‌ను త‌న ప్ర‌భుత్వంలోకి తీసుకొనేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ప‌రిపాల‌నా ప‌రంగా కీల‌క బాధ్య‌త‌ల‌ను కొంద‌రు సీనియర్ అధికారుల‌కు అప్ప‌గించ‌నున్నార‌నె వార్త‌లు వ‌నిపిస్తున్నాయి.

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులతో పాటు పలువురు సీనియర్ల కోసం జగన్ అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పాలనా యంత్రాంగం సవ్యంగా నడవాలంటే సీఎస్ పదవి అత్యంత కీలకం. ప్ర‌స్తుతం సీఎస్‌గా కొన‌సాగుతున్న ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను కొన‌సాగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంతో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎల్వీ కీలక పదవుల్లో పనిచేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు విధేయుడుగా ఉన్న సీఎస్ పునేఠాను బ‌ద‌లీచేసి ఆయ‌న స్థానంలో ఎల్వీకి బాధ్యతలు అప్పగించింది. సీనియర్ కావడంతో పాటు ఐఏఎస్ ల్లోనూ మెజారిటీ మద్దతు ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ సీఎస్ గా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మాజీ సీఎస్ అజేయ కల్లంకు కూడా కీలకమైన ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా సీఎస్ తో పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, ఇతర కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం అజేయ కల్లానికి ఉంది. గ‌త కొంత కాలంగా బాబు ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాల‌పై పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో సాగిన వ్యవహారాలతో పాటు ఆర్ధికశాఖపై ఆయనకు గట్టి పట్టు ఉన్నందున ఆర్ధిక సలహాదారుగా జగన్ ఆయన్ను తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మరో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సేవలను కూడా వాడుకునేందుకు జగన్ సై అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా గెలుపుపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్ ఇప్పటినుంచె త‌న టీమ్ రెడీ చేసె ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -