Monday, May 5, 2025
- Advertisement -

గ‌జ ధాటికి త‌మిళ‌నాడు గ‌జ‌గ‌జ‌..20 మంది మృతి

- Advertisement -

గజ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను దాటికి త‌మిళ‌నాడు చిగురుటాకులా వ‌ణికిపోతోంది. తుఫాను కార‌నంగా ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది చినిపోయారు. ఈదురుగాలతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచింది. చాలా ప్రాంతాలు ముంపునకు గురవ్వడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్ర‌జా ర‌వాణా స్తంభించింది.

కడలూరుకు చెందిన ఇద్దరితో పాటు… తంజావూరు వాసులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కడలూరు. నాగపట్నం, తొండి, పంబన్‌లో వేకువజాము నుంచి తుపాను ప్రభావం చూపించింది.

శుక్రవారం ఉదయం 5.30 గంటలకు కడలూరులో 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. నాగపట్నంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పక్కనే ఉన్న పుదుచ్చేరిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ‘‘గజ’’ ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.. ముందస్తు చర్యల్లో భాగంగా 80 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఒక్క తంజావూరులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరువారూర్‌లో నలుగురు, పుడుక్కొట్టాయ్‌లో ముగ్గురు, తిరుచిలో ఇద్దరు, నాగపట్నంలో ఒకరు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -