Sunday, May 5, 2024
- Advertisement -

ఏపీనీ వ‌ణికిస్తున్న గ‌జ తుఫాన్‌..భ‌యం గుప్పిట్లో ప్ర‌జ‌లు…రెడ్ అల‌ర్ట్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడటంతో కోస్తా వణుకుతోంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారి.. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి వాతావరణ శాఖ ‘‘గజ’’ తుఫానుగా నామకరణం చేశారు.

స్తుతం ఇది శ్రీహరి కోటకు 980 కిలోమీటర్లు.. చెన్నైకు 840 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం చెన్నై నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తీరం వెంట గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.కడలూరు ఓడరేవుల్లో మూడో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -