Thursday, May 16, 2024
- Advertisement -

త‌మిళ‌నాడును వ‌ణికిస్తున్న గ‌జ తుఫాను..11 మంది మృతి

- Advertisement -

గజ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు సైక్లోన్ ధాటికి 11 మంది మృతిచెందారు. ఇప్ప‌టికే తీరం దాటిన తుఫాను ధాటికి తమిళనాడు, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కడలూరు. నాగపట్నం, తొండి, పంబన్‌లో వేకువజాము నుంచి తుపాను ప్రభావం చూపించింది. గాలుల వేగానికి పలు ప్రాంతాలలో చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మరో 16 గంటల పాటూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. హై అలర్ట్ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచే తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, పుడుకొట్టాయ్, నాగపట్నం, కడలూరు, తిరువారూర్, రామనాథపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాకాసి గాలుల దెబ్బకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

గురువారం రాత్రి నుంచే తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, పుడుకొట్టాయ్, నాగపట్నం, కడలూరు, తిరువారూర్, రామనాథపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాకాసి గాలుల దెబ్బకు వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు తుఫాన్ ప్రభావం ఏపీపై కూడా కనిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురవగా.. చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -