దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా కిమ్స్ లో దాసరి నారాయణ రావుకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఇటివలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దాసరి నారాయణ రావు మళ్లీ హాస్పిటల్ లో చేరడంతో.. ఆయన భిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రస్తుతం ప్రస్తుతం దాసరి నారాయణ రావు అధిక రక్తపోటుతో పాటు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లుగా కిమ్స్ హాస్పిటల్ వార్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని డాక్టర్లు అనధికారికంగా చెబుతున్నారు. ప్రస్తుతం దాసరిని పరామర్శించేందుకు ఆయన సన్నిహితులు, సినీ వర్గాల వారు మరియు బంధువులు హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు.
{youtube}z4xsB33ftHc{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
