Saturday, May 18, 2024
- Advertisement -

బ్యాంక్‌ల ఖాతాదారుల‌కు ఆర్బీఐ శాభ‌వార్త‌

- Advertisement -
Bank account number portability can be reality soon: RBI

ప్ర‌స్తుతం టెల‌కం రంగం మొబైట్ నెంబ‌ర్ల పోర్ట్‌బులిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ని కోల్పోకుండా అదే నెంబర్ తో తాము వాడే నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్ కు మారిపోయేవారు.

ఇదే సౌకర్యం ఇప్పుడు బ్యాంకు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. బ్యాంకు అకౌంట్ నెంబర్ పోర్టబులిటీ త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తోంది. దీనికోసం ఆర్బీఐ క‌స‌ర‌త్తు ప్రారంభించింది.
ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ లాంటి ఎలాంటి లావాదేవీ వివరాలు కోల్పోకుండా, అదే అకౌంట్ నెంబర్ తో మరో బ్యాంకుకు కస్టమర్లు మారేలా వెసులుబాటు కల్పించనున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆధార్ నమోదు, టెక్నాలజీ పురోగతి పెరుగుతుండటంతో, బ్యాంకులు, వాటాదారులు బ్యాంకు అకౌంట్ నెంబర్ పోర్టబులిటీని రియాల్టీలోకి తెచ్చేందుకు సన్నద్దమవ్వాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించింది.

{loadmodule mod_custom,Side Ad 1}

భారతీయ బ్యాంకింగ్ సిస్టమ్ లో రెండు కీలక అంశాలు దీనికి సహకరించనున్నాయి. ఒకటి కస్టమర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్, రెండు సెంట్రల్ పేమెంట్ సిస్టమ్ గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఉండటం. గత రెండేళ్లుగా దీనిని అమల్లోకి తేవాలని యోచిస్తున్నామని, ఆధార్ నమోదు, ఎన్పీసీఐ, వెనువెంటనే పేమెంట్ సిస్టమ్ గా ఎక్కువ యాప్స్ అందుబాటులోకి వస్తుండటం, బ్యాంకు అకౌంట్ నెంబర్ పోర్టబులిటీకి దోహదం చేస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -