ఆమె ఒక కాల్ గర్ల్.. ఆమెను కొంతమంది విటులు బుక్ చేసుకొన్నారు. నలుగురు స్నేహితులు కలిసి ఆమెను ఇంటికి తెచ్చుకొన్నారు. మరి ఒక రాత్రి అంతా ఆమెతో వ్యవహారం వారికి బాగానే నడించింది.
అయితే మరుసటి రోజున ఆమె వెళ్లి వారిపై రేప్ కేస్ పెట్టింది. ఆ నలుగురు స్నేహితులు తనపై అత్యాచారం చేశారని పోలీస్ కేసు పెట్టింది. 2014 నవంబర్ లో ఢిల్లీలో ఈ కేసు నమోదు అయ్యింది. మరి ఆమె కేసు పెట్టేసరికి ఢిల్లీ పోలీసులు ఆ నలుగురినీ అదుపులోకి తీసుకొన్నారు.
అప్పటికే నిర్భయ కేసు వెలుగులోకి వచ్చింది. రేప్ కేసులపై తీవ్రమైన యాక్ట్ నిర్భయ చట్టం వచ్చింది. ఇంకేముంది.. ఆ నలుగురు స్నేహితులూ పూర్తిగాబుక్ అయ్యారు. డబ్బు ఇచ్చి వ్యభిచారం చేసినందుకు రేప్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఇక ఇంతే జీవితం అనుకొంటున్న సమయంలో.. ఎట్టకేలకూ ఆ కాల్ గర్ల్ వాళ్లకు ఊరటనిచ్చింది. తను వారిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టానని ఆమె కోర్టుకు చెప్పింది.
తను ఒక కాల్ గర్ల్ అని.. తనను వారు నలుగురూ ఆరు వేల రూపాయలు ఇస్తామని బుక్ చేసుకొన్నారని.. అయితే నాలుగురు వేల రూపాయలే ఇచ్చారని.. దీంతో కోపం తో వారిపై కేసు పెట్టానని ఆమె కోర్టు దగ్గర తప్పు ఒప్పుకొంది. దీంతో ఆ నలుగు విటులకూ ఊరట లభించింది. దీంతో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. మరి ఏదో సరదాగా అని వ్యభిచారం చేసిన వాళ్లకు రేపిస్టుల ముద్ర పడింది. ఏడాదిపాటు క్షోభ అనుభవించారు. కేసు అయితే కొట్టి వేయబడింది కానీ.. వారిపై పడ్డ ముద్ర అయితే పోదు కదా!