Sunday, April 28, 2024
- Advertisement -

బాబుకు మోడీ పిలుపు.. బంధం బలపడేనా?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజులుగా బీజేపీ ధోస్తి కోసం ఎదురుచూస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీల తో కలిసి కూటమిగా ఏర్పడి 2014 సీన్ రిపీట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటోంది. దాంతో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా టీడీపీ వైపు వెళ్ళేందుకు సిద్దంగా లేనట్లే కనిపిస్తోంది. దాంతో చంద్రబాబు అనుకున్న ప్రణాలికలేవీ అమలయ్యేలా కనిపించడం లేదు. ఆ మద్య రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం కొరకుండానే టీడీపీ మద్దతు ప్రకటించినప్పటికి బీజేపీ మాత్రం చంద్రబాబును లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే టీడీపీతో పొత్తు ఉండే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు కమలనాథులు.

ఇదిలా ఉంచితే డిల్లీ పెద్దల నుంచి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. డిసెంబర్ 5న బాబు డిల్లీకి బయలు దేరాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి పోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. భారత్ లో నిర్వహించే జి20 సదస్సు పై రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు, అభిప్రాయాలూ తెలుసుకునేందుకు అన్నీ రాజకీయ పార్టీల అధినేతలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆకోవలోనే చంద్రబాబుకు కూడా పిలుపు వచ్చినప్పటికి.. పోలిటికల్ సర్కిల్స్ లో మాత్రం చర్చ వేరేలా జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం మోడీతో ప్రత్యక బేటీ అయ్యే అవకాశం ఉందని, టీడీపీ బీజేపీ పొత్తు ప్రస్తావనను బాబు మోడీ ముందుంచే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. అయితే బాబు కోసం మోడీ సమయం కేటాయిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ మోడీ చంద్రబాబు ప్రత్యేక భేటీకి అవకాశం ఉంటే పొత్తులకు సంభంచించిన చర్చే జరిగే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ. మరి బీజేపీతో కలవాలని ఉవ్విళ్లూరుతున్న బాబు ఆశలు అసలు ఫలిస్తాయా ? లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ ప్లాన్ అదుర్స్?

జనసేన కాదు రౌడీసేననే…

జాగ్రత్త.. ప్రమాదంలో కాంగ్రెస్… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -