Thursday, April 25, 2024
- Advertisement -

బీజేపీ బంపర్ ఆఫర్ .. డిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి 5500 కోట్లు !

- Advertisement -

ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తోన్న వ్యూహాలు దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఆయా పార్టీలలోని ఎమ్మెల్యేలను కొనడం ఆ తరువాత ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడమే ప్రధాన ఎజెండాగా మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలు పన్నుతున్నట్లు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి అర్థమౌతుంది. మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంలో ఏక్ నాథ్ షిండే ద్వారా చీలిక తెచ్చి బీజేపీకి అనుకూలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక చాలా పార్టీలలో కూడా షిండేలు పుట్టుకొస్తారు అని బీజేపీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలలోని బిజెపేతర పార్టీలలో గుబులు పట్టుకుంది. ఆ భయంతోనే బిహార్ లో నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పిన సంగతి కూడా విధితమే.

ఇదిలా ఉంచితే ప్రస్తుతం బీజేపీ కన్ను డిల్లీపై పడినట్లు తెలుస్తోంది. డిల్లీ లో ప్రభుత్వంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వరుసగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియ లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే సిసోడియ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ గా హిట్ ను పెంచాయి. తనను బీజేపీ తరుపున ఏక్ నాథ్ షిండే పాత్ర పోషించమని, అలా పోషించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చితే డిల్లీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బిజెపి పెద్దలు తనకు ఆఫర్ చేసినట్లు మనిష్ సిసోడియ చెప్పుకొచ్చారు. దాంతో అప్రమత్తమైన అరవింద్ కేజ్రివాల్ తన ఎమ్మెల్యేలతో ఇటీవల భేటీ అయ్యి పలు ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించాడు.

ఆప్ నుంచి బీజేపీలో చేరే ప్రతి ఎమ్మెల్యేకు 20 కోట్లు ఆఫర్ చేసినట్లు కేజ్రివాల్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆ విధంగా చూస్తే 277 మంది ఎమ్మెల్యేలను కొనుక్కునేందుకు బీజేపీకి 5500 కోట్లు అవసరమౌతాయని.. అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడినుంచి వచ్చిందని కేజ్రివాల్ ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తన పార్టీ ఎమ్మేల్యేలు తలొగ్గలేదని కేజృవాల్ చెప్పుకొచ్చారు. అయితే డిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోంది ? అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీని భవిష్యత్ ప్రత్యర్థి పార్టీగా బిజెపి భావిస్తోందని, మోడీకి ధీటైన ప్రత్యర్థిగా కేజృవాల్ నిలిచే అవకాశం ఉందని ఇప్పటినుంచే ఆప్ అనగదొక్కెందుకు మోడీ- అమిత్ షా ద్వయం ప్రణాళికలు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

కుప్పం రగడ.. ఎవరి ప్లాన్ ?

జగన్ ” ఫ్లెక్సీ బ్యాన్”.. సాధ్యమేనా ?

కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం అదే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -